రేపటి బంద్ ను అడ్డుకోవద్దు

హైదరాబాద్: ప్రత్యక హోదా కోసం చేస్తున్న ఉద్యమాలన్నిటిని అణిచివేయడానికి
ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు కనీసం ఇప్పుడైనా ఈ నెల 24 న (మంగళవారం )  తలపెట్టిన
బంద్ ను అడ్డుకోవద్దని వైయస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి
చేశారు. అవిశ్వాసం వీగిపోయిన తరువాత ఢిల్లీకి వెళ్లడంలోని ఆంతర్యం కృతజ్ఞతలు
చెప్పడమా? లేక సంధి చేసుకోవడమా? అని సూటిగా ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ
సందర్భంగా ఏ ఒక్క పార్టీవారైనా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రశ్నించార? మరి
ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడుకు ఎవరు మద్ధతు పలికినట్లని ఆయన అడిగారు.

Back to Top