చంద్రబాబుకి భయపడేది లేదు: వైయస్సార్సీపీ నేతలు

నగరి: వైయస్సార్సీపీ నాయకుల్ని
లక్ష్యంగా చేసుకొని టీడీపీ నేతలు చేస్తున్న దాడుల మీద సర్వత్రా నిరసన వ్యక్తం
అవుతోంది. వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని పార్టీ కీలక
నేతలు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణస్వామి స్పష్టంచేశారు.చిత్తూరు
జిల్లా నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆదివారం విస్తృతస్థాయి సమావేశం
నిర్వహించారు. 

సీఎం
చంద్రబాబు నాయుడు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వైఎస్ఆర్‑సీపీ నేతలు
పేర్కొన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఫార్టీ ఫిరాయించిన నేతలతో రాజీనామా చేయించాలని
డిమాండ్ చేశారు. రెండేళ్ల పాలనలో సీఎం చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని
ప్రతిపక్ష వైఎస్ఆర్‑సీపీ నేతలు విమర్శించారు.

 

Back to Top