కేసులకు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి

పార్టీశ్రేణులకు వైయస్ జగన్ భరోసా
వైయస్సార్ జిల్లాలో జననేత పర్యటన
పులివెందులలో స్థానిక ప్రజలతో ముఖాముఖి
పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న వైయస్ జగన్

వైయస్సార్ జిల్లాః ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైయస్సార్ కడప జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నేడు రెండో రోజు జిల్లాలో వైయస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. పులివెందుల క్యాంపు కార్యాలయంలో స్థానిక ప్రజలతో వైయస్ జగన్ ముఖాముఖి నిర్వహించి  వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రైతులతో కలిసి పంటపొలాల్ని పరిశీలించి వారి సాధకబాధల్ని అడిగి తెలుసుకోనున్నారు. 

వైయస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం కడపలోని పెద్ద దర్గాను దర్శించుకుని వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైయ‌స్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు, క‌డ‌ప ఎమ్మెల్యే అంజ‌ద్ బాషా, వైయ‌స్సార్‌సీపీ గ‌ల్ఫ్ క‌న్వీన‌ర్ బీహెచ్ ఇలియాస్‌లు సంయుక్తంగా పెద్ద‌ద‌ర్గా సమీపంలోని అమీన్ ఫంక్ష‌న్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వైయ‌స్ జ‌గ‌న్‌మోహహ‌న్ హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఈద్ ను జరుపుకోవాలని ఆకాంక్షించారు. 

అంతకుముందు వైయస్ జగన్ అనంత‌పురం జిల్లా ఓబుళ‌దేవ‌ర చెరువు(ఓడీసీ) మండ‌ల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. టీడీపీ అక్రమ కేసుల‌కు భ‌య‌ప‌డొద్దని, ధైర్యంగా ఉండాలని వారికి భ‌రోసా ఇచ్చారు. ఏ త‌ప్పు చేయ‌కున్నా తమపై అక్రమంగా కేసులు పెడుతున్నార‌ని పార్టీ నేతలు, కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ జ‌గ‌న్ కు మొరపెట్టుకున్నారు. రైతు భరోసా యాత్ర చేప‌ట్టిన స‌మ‌యంలో టీడీపీ నాయ‌కులు త‌మ‌పై దాడులు చేశార‌ని తెలిపారు. వారిపై కేసులు పెట్ట‌కుండా 12 మంది వైయ‌స్సార్‌సీపీ నాయ‌కుల‌పై కేసుల‌ను న‌మోదు చేసిన విష‌యం వివ‌రించారు.  వైయస్ జ‌గ‌న్ స్పందిస్తూ అందరికీ అండగా ఉంటానని, ఎవరూ అధైర్యపడొద్దని వారిలో ధైర్యం నింపారు.
Back to Top