జగ‌న్మోహన్‌రెడ్డి యాత్రను అడ్డుకుంటే సహించం

కాజీపేట (వరంగల్ జిల్లా :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి తెలంగాణలో నిర్వహించే యాత్రను అడ్డుకుంటే సహించబోమని పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి కాయిత రా‌జ్‌కు‌మార్ యాదవ్ ‌హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి బడుగు‌, బలహీన వర్గాల కోసం తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వాటి వల్ల ఎందరికో లబ్ది చేకూరిందన్నారు. తెలంగాణ ప్రజలు వైయస్ కుటుంబం పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నారని అన్నారు.‌ మహానేత వైయస్‌ఆర్ తనయు‌డైన శ్రీ జగన్మోహన్‌రెడ్డి తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తారని, ఆయన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.

కొంత మంది రాజకీయ నాయకులు లబ్ది కోసం శ్రీ వైయస్ జగ‌న్ యాత్రను అడ్డుకుంటామని అలజడి సృష్టిస్తున్నారని వారికి ప్రజలే బుద్ది చెబుతారని‌ రాజ్‌కుమార్‌ యాదవ్ అన్నారు. తెలంగాణలో‌ శ్రీ జగన్ యాత్ర ‌విజయవంతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ మైనార్టీ నాయకుడు సయ్యద్ తాజుద్దీ‌న్‌ కూడా పాల్గొన్నారు.

Back to Top