వైయస్ జగన్ ను ఆడిపోసుకుంటే నాలుక కోస్తాం

–అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ ఎమ్మెల్యే శ్రీధర్
–దేవుడు సొమ్మును కూడ కాజేసిన ఘనుడు శ్రీధర్‌
–ఇసుక గుంతలో పడి చనిపోయిన వారి ఉసురు మీకు తగులుతుంది.
–జగన్‌ను శ్రీధర్‌ విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది
–వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మనోహర్‌ నాయుడు

పెదకూరపాడుః టీడీపీ నేతలు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు, చవాకులు పేల్చితే నాలుక కోస్తామని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి శివ నాగ మనోహర్‌ నాయుడు హెచ్చరించారు. స్థానికంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఇసుక దందాలు చేసి వేల కొట్ల ప్రజాధనం దండుకున్న పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. నీరు– చెట్టు పేరుతో ప్రజల సంపదను దోచుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. సదావర్తి భూముల్లో లెక్కలేని దేవుడు సొత్తును దోచుకున్నారని విమర్శించారు. ఇసుకను ఎక్కడ పండితే తవ్వి గుంతలు చేసి వదిలేయడం వల్లన అనేక మంది యువకులు ప్రాణాలను కోల్పోయ్యారని వారి ఉసురు శ్రీధర్ కు తప్పక తగులుతుందన్నారు. కృష్ణా పుష్కరాల నిధులు స్వాహా చేసిన శ్రీధర్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాట్లాడే అర్హత లేదన్నారు. 2004 నాటికి కొమ్మాలపాటి శ్రీధర్‌ ఏం చేసేవాడు, అతని పరిస్థితి ఏమిటి అనేది పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు తెలుసునన్నారు. శ్రీధర్ అవినితి, ఆయన చేస్తున్న భూదందాల గురించి ప్రతీ ఒక్కరికీ తెలుసునన్నారు. రాబోయే ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు టీడీపీ నేతలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పేద ప్రజల కోసం నిరంతం పని చేసే నేత జగన్‌మోహన్‌రెడ్డి అని స్పష్టం చేశారు. 
Back to Top