అధైర్య పడొద్దు..అండగా ఉంటా

  • వెంకటేశ్వర్లు కుటుంబానికి వైయస్ జగన్ పరామర్శ
  • రైతుల కష్టాలు తెలుసుకుంటూ మున్ముందుకు
  • ప్రతీ గ్రామంలో జననేతకు జననీరాజనం..పూలవర్షం
కర్నూలు: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భరోసా కల్పించారు. అధైర్య పడొద్దు..అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో వైయస్‌ జగన్‌ చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడోరోజు శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగింది. శనివారం ఉదయం వెలుగోడు మండలం వేల్పనూరు నుంచి యాత్రను ప్రారంభించిన వైయస్‌ జగన్‌.. బోయరేవుల గ్రామం చేరుకున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

 చాకలి వెంకటేశ్వర్లు 2012వ సంవత్సరం నుంచి 2014 వరకు 14 ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశారు. అయితే 2014లో కురిసిన వడగండ్ల వానకు వెంకటేశ్వర్లు సాగుచేసిన పంట నీటి మునిగింది.  పంట సాగుకోసం బ్యాంకులో రూ. 30వేలు అప్పు చేసిన చాకలి వెంకటేశ్వర్లు.. ప్రైవేటుగా వడ్డీ వ్యాపారి వద్ద రూ. మూడు లక్షల 70వేలు అప్పు చేశారు. పంట చేతికి అందకపోవడం, ఈ అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోవడం, చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడంతో వెంకటేశ్వర్లు 2015 ఆగస్టు 8న బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోకపోవడంతో వైయస్‌ జగన్‌  చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఓదార్చి.. ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

అనంతరం వైయస్‌ జగన్‌ మోత్కూరు, తిమ్మనపల్లి, బండిఆత్మకూరు మండలంలోని చిన్నదేవలాపురం, నారాయణపురం, సంతజూటూరు మీదగా లింగాపురం చేరుకున్నారు. ప్రతి గ్రామంలో జననేతకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా స్థానికులు వారి ఇబ్బందులు, చంద్రబాబు మోసాలను వైయస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. అందరి బాధలు ఓపికతో వింటూ, తన కోసం వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ వైయస్‌ జగన్‌ ముందుకు సాగారు. యాత్రలో వైయస్‌ఆర్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బుడ్డా శేషారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బీవై రామయ్య, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 
 
Back to Top