వైఎస్సార్సీపీలో చేరిన వరంగల్ టీడీపీ నేత

వైఎస్సార్సీపీలోకి దొమ్మాటి సాంబయ్య
వైఎస్ జగన్,పొంగులేటి సమక్షంలో చేరిక
రాజన్న కుటుంబం నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక
తెలంగాణలో టీడీపీ టీఆర్ఎస్ తో కుమ్మక్కైయింది

హైదరాబాద్
: వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ నేత దొమ్మాటి సాంబయ్య వైఎస్సార్సీపీలో
చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ వైఎస్సార్సీపీ
ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం
తీసుకున్నారు. సాంబయ్యతో పాటు జిల్లాకు చెందిన ఇతర టీడీపీ నాయకులు,
కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జననేత సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం
పుచ్చుకున్నారు.  ఈ సందర్భంగా దొమ్మాటి మాట్లాడుతూ... మహానేత వైఎస్
రాజశేఖరరెడ్డి కుటుంబం నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక అన్నారు. వైఎస్
జగన్, పొంగులేటి ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేస్తానని ఆయన స్పష్టం
చేశారు.

ఒకప్పుడు బడుగుల పార్టీ అయిన టీడీపీ
ఇప్పుడు హైజాక్ అయిందని, ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని ఆ పార్టీ కోల్పోయిందని
దొమ్మాటి సాంబయ్య వ్యాఖ్యానించారు.  బడుగు, బలహీన వర్గాలకు దళిత,
గిరిజనులకు టీడీపీ దూరమైందన్నారు. తెలంగాణ టీడీపీలో కొంతమంది నాయకులు
టీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని దొమ్మాటి విమర్శించారు. టీడీపీ నేతలంతా
 టీఆర్ఎస్ కు కోవర్టులుగా పనిచేస్తూ... తెలుగుదేశాన్ని కూకటి వేళ్లతో
పెకలించే పనిలో ఉన్నారని అన్నారు. 

మహానేత వైఎస్
రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజల గుండెల్లో
చిరస్థాయిగా నిలిచారని సాంబయ్య కొనియాడారు. రైతులు, విద్యార్థులు,
నిరుద్యోగులు, బడుగు, బలహీన వర్గాల ప్రాణదాతగా నిలిచారన్నారు. విద్యలో
సమూలమైన మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. సక్సెస్ స్కూళ్లు, ఫీజు
రీయింబర్స్ మెంట్ పథకాలు తీసుకొచ్చి విద్యాదాతగా నిలిచారన్నారు. చదవలేని
నిరుపేదలకు    
ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కల్పించి ఇంటికో ఇంజినీరింగ్ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డిదేనని సాంబయ్య తెలిపారు. 

రైతులకు
ఉచితవిద్యుత్, గిట్టుబాటు ధర, సరసమైన ధరలకు నాణ్యమైన విత్తనాలు అందించారని
పేర్కొన్నారు.  ఆరోగ్యశ్రీ పథకంతో ఎంతోమందికి ప్రాణం పోశారన్నారు. అన్ని
వర్గాల ప్రజలను ఆదుకున్న ఏకైక నాయకుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. భారతదేశంలో
ప్రజల పక్షాన పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్సీపీ
మాత్రమేనన్నారు. ప్రజలందరూ అర్థం చేసుకొని వైఎస్సార్సీపీని ఆదరించాలన్నారు.
వైఎస్ జగన్ నాయకత్వంలో మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని
పిలుపునిచ్చారు.
Back to Top