బ‌డ్జెట్‌లో క‌రువు మాటే లేదు

ఏపీ అసెంబ్లీ:  రాష్ట్రంలో వ‌రుస‌గా క‌రువుతో ప్ర‌జ‌లు అల్లాడుతుంటే య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్లో క‌రువు అనే మాటే వినిపించ‌లేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌రరెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బుధ‌వారం బ‌డ్జెట్ స‌మావేశం అనంత‌రం ఎమ్మెల్యే మీడియా పాయింట్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితిని ప్ర‌భుత్వం వాస్త‌వ‌ రీతిలో గుర్చించలేదన్నారు. సుదీర్ఘమైన వ్యవసాయ బడ్డెట్ లో కరువు అనే పదం వాడకపోవడం దారుణ‌మ‌న్నారు. 300 మండలాలకు పైగా మూడేళ్లుగా కరువు కంటిన్యూ అవుతున్నా ఏవిధంగా అధిగమించాలన్న ఆలోదనే లేద‌ని విమ‌ర్శించారు. దాన్ని ఎదుర్కొనే లక్ష్యాలు బడ్జెట్ లో ప్రతిబింబించతలేదన్నారు. రుణమాఫీ విష‌యంలో కూడా రైతుల‌ను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. 


రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల ఖాతాలు ఓవ‌ర్ డ్యూ అమౌంట్లు ఉన్నాయ‌ని, రైతులు బ్యాంకు మెట్లు ఎక్క‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బాబు తీరు వ‌ల్లే రైతులు బ్యాంకుల‌కు దూర‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం ఇన్సూరెన్స్ కంపెనీల‌కు ప్రీమియం చెల్లించ‌క‌పోవ‌డంతో రైతుల‌కు ప‌రిహారం అంద‌డం లేద‌న్నారు. ఇన్‌ఫుట్ స‌బ్సిడీని విస్మ‌రించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతులు క‌రువులోనూ ఏదోలా పంట‌లు పండించినా అమ్ముకోలేని దుస్థితి నెల‌కొంద‌న్నారు. ఉల్లి, మిర‌ప‌, ట‌మోట రైతుల ప‌రిస్థితి ఆందోళ‌నక‌రంగా ఉంద‌న్నారు. ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు ఇచ్చిన ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి ఏమైంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో 70 ల‌క్ష‌ల కుటుంబాలు వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డ్డాయ‌ని, ఇలాంటి రంగాన్ని ప్ర‌భుత్వం ప‌ట్టించుకోపోవ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. ప్ర‌యివేట్ జ‌పం చేస్తున్న చంద్ర‌బాబు రైతుల‌ను వ‌దిలేశార‌ని విశ్వేశ్వ‌ర‌రెడ్డి మండిప‌డ్డారు.
Back to Top