వైఎస్ జ‌గ‌న్‌ను విడిచి వెళ్ల‌ను :ఎమ్మెల్యే మేక ప్ర‌తాప్ అప్పారావుఎవ‌రెన్ని ప్ర‌లోభాల‌కు గురి చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని విడిచి వెళ్ల‌న‌ని నూజివీడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేక ప్ర‌తాప్ అప్పారావు స్ప‌ష్టం చేశారు. విజయవాడలో అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల్లో పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  టీడీపీ నేత‌లు ఫోన్లు చేసి పార్టీ మార‌మ‌ని తమను ప్ర‌లోభ పెడుతున్నార‌న్నారు. నాడు వైఎస్సార్ గుర్తుతో ఎమ్మెల్యేగా గెలిచాన‌ని, ఈ రోజు డ‌బ్బు, అధికారం కోసం పార్టీ మారే వ్య‌క్తిని కాద‌ని తేల్చి చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు బాధ‌ప‌డే రోజులు త్వ‌ర‌లోనే వ‌స్తాయ‌ని అప్పారావు స్ప‌ష్టం చేశారు. 
Back to Top