ఎన్నికలప్పుడే బీసీలు గుర్తొస్తారా?

నంద్యాల: ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ ప్రెసిడెంట్‌ జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే బాబుకు కుల సంఘాలపై ఎక్కడలేని పుట్టుకొస్తుందని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీల్లో కొన్ని కులాలను చేర్చుతానని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు మూడేళ్లుగా వారిని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. గత తొమ్మిదేళ్ల పరిపాలనలో, ప్రస్తుతం మూడున్నరేళ్ల పరిపాలనలో చంద్రబాబు బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఓట్ల కోసం చంద్రబాబు మభ్యపెట్టడం, ప్రలోభాలకు గురిచేయడం, చివరికి భయపెట్టడం కూడా చేస్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అన్ని కులాలు చంద్రబాబు వ్యతిరేకంగానే ఉన్నారని స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం చేసిన ఏకైక వ్యక్తి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని చెప్పారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై బీసీలకు అభిమానం ఉందని స్పష్టం చేశారు. నంద్యాల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీసీలంతా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

Back to Top