బాబుకు బుద్దుందా..రైతులంటే ఎగతాళా..?

  • పోర్టు పేరుతో రైతుల భూములు లాక్కోవడం దారుణం
  • ఇదే మోసం బాబు రాజధానిలో కూడా చేశారు
  • ఒక్క ఇటుక కూడా వేయకుండా అంతా టెంపరరీ అంటాడు
  • ఈ దుర్మార్గపు పాలన ఇంకెంతోకాలం కొనసాగదు
  • బాబు పాలన బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుంది
  • బుద్దాలపాలెంలో బాధిత రైతులతో వైయస్ జగన్
కృష్ణాః బందర్ పోర్టు అనుబంధ పరిశ్రమల భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బాధిత రైతులకు కొండంత అండగా నిలిచారు. పోర్టు పేరుతో స్థానిక రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సర్కార్ భూ సేకరణకు వ్యతిరేకంగా 24 గ్రామాల ప్రజలు 15 నెలలుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ బాధితులకు బాసటగా నిలిచారు. వారితో ముఖాముఖి నిర్వహించి స్వయంగా కష్టాలు అడిగి తెలుసుకున్నారు. 

కాళికారావు రైతు, బుద్దాలపాలెం
నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. వరి, మినుము, వేరుశనగ వంటి పంటలు పడిస్తాం. రెండేళ్ల నుంచి పంటలకు నీళ్లు ఇవ్వడం లేదు. మాకు వ్యవసాయం తప్ప మరో విషయం తెలియదు. భూములు ఇస్తేనే తీసుకుంటామంటూనే మెడపై కత్తి పెట్టి బెదిరిస్తున్నారు. లోన్లు రాకుండా చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు ఆపేశారు. అవసరాల కోసం మా భూములు అమ్ముకోవాలన్నా కుదరడం లేదు. 

వైయస్ జగన్‌ః ఆనాడు ఎన్నికలకు ముందు చంద్రబాబు 5 వేల ఎకరాలు ఎందుకన్నారు. ఇప్పుడేమో 30వేల ఎకరాల సేకరణకు పథకం రచించారు. ఇప్పుడేమో లక్షా 5వేల ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌లో తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. రైతులంటే చంద్రబాబుకు ఎగతాళిగా ఉంది. మన భూముల్లో మనకు వెయ్యి గజాల స్థలం ఆయన బిక్షంగా ఇవ్వడమేమిటి. ఇదెక్కడి న్యాయం. సంవత్సరానికి 30 వేలు ఇస్తారా.. రెండు పంటలు పండే భూమికి 50 వేలిస్తారా. అది బ్యాంకుల్లో వేసుకున్నా వచ్చే వడ్డీ కన్నా ఇది తక్కువ. అదికూడా పదేళ్లే ఇస్తారా. చంద్రబాబుకు బుద్దుందా. ఇదే మోసం రాజధానిలో చేశారు. రైతులను ఇదే విధంగా బెదిరించి భూములు లాక్కున్నారు. ఇప్పటికీ ఒక్క ఇటుక కూడా లేపలేదు. ఇలాంటి దుర్మార్గపు చంద్రబాబు పాలన ఇంకెంతో కాలం కొనసాగదు. ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయింది. రెండేళ్లు ఓపిక పట్టండి. మనం అధికారంలోకి వస్తాం. 5వేల కన్నా ఒక్క ఎకరం కూడా తీసుకోం. అందులోనే బ్రహ్మాండంగా నిర్మిస్తాం. ప్రజా పాలన తీసుకొస్తాం. రైతులు సంతోషంగా భూములు ఇచ్చేలా వారికి నష్టపరిహారం ఇస్తాం. భూ బాధితులకు కనీసం 40 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. రైతులకు న్యాయం చేయలేకపోతే దిగిపోండి. రైతులు కోటి రూపాయలకు భూములు అమ్ముకునే రోజు వస్తే సంతోష పడాలే తప్ప చంద్రబాబులా ఏడుస్తారా. బాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుంది. 




Back to Top