పచ్చనేతలపై చర్యలకు డిమాండ్

పశ్చిమగోదావరి(చింతలపూడి) : అధికార పార్టీ నేతల జులుం పెచ్చుమీరుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో అధికార పార్టీకి చెందిన ఎంపీపీ దాసరి రామక్క, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కో చైర్మన్ బోడా నాగభూషణం తరచూ ఆస్పత్రికి వచ్చి వైద్యులను, సిబ్బందిని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దుర్భాషలాడుతున్నారు.
 
వారి ధాటికి తాళలేక  వైద్యులు, సిబ్బంది విధులను బహిష్కరించి, ధర్నాకు దిగారు. ఎంపీపీపై చర్యలు తీసుకోవాలని, కో చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అప్పటివరకు ప్రతిరోజూ రెండు గంటలపాటు నిరసన తెలుపుతామని వారు హెచ్చరించారు. 
Back to Top