ఎంపీలకు వైద్యపరీక్షలు

ఢిల్లీ:  ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసి.. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టిన‌ వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల‌కు రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రి వైద్యులు శనివారం పరీక్షించారు. వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఎంపీల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఆ పార్టీ ఎంపీలు శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేసి.. వెంటనే ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.
Back to Top