రాజీనామా చేయించే దమ్ము బాబుకు ఉందా..?

తిరుపతి: ప్రతిష్టాత్మక మన్నవరం ప్రాజెక్ట్ తరలిపోతుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతో కష్టపడి మన్నవరం ప్రాజెక్ట్ సాధించారని గుర్తు చేశారు.

ప్రత్యేక సాయం ద్వారా పరిశ్రమలు వస్తాయనేది వట్టి భూటకమని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తామని వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారన్నారు. తన ఎంపీలతో రాజీనామా చేయించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని భూమన సవాలు విసిరారు.
Back to Top