అలాగని గూగుల్ ను మూసేస్తారా..?

  • సోషల్‌ మీడియాను చూసి వణుకుతున్న బాబులు
  • పప్పు ఆంధ్రప్రదేశ్ అని కొడితే గూగుల్‌ కూడా లోకేష్‌నే చూపిస్తుంది
  • అలాగని గూగుల్‌ను బ్యాన్‌ చేస్తారా..? అంత శక్తి మీకుందా..?
  • కులాల మధ్య చిచ్చుపెట్టి రాక్షసానందం పొందుతున్న చంద్రబాబు
  • జేసీది రాక్షస భాష, కుట్రపూరితంగానే వైయస్‌ జగన్‌పై వ్యాఖ్యలు
  • టీడీపీలా కులానికి ప్రాతినిథ్యం వహించే పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ కాదు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి
హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో ప్రభుత్వ అన్యాయాలు, అక్రమాలపై వస్తున్న విమర్శలను తట్టుకోలేక చంద్రబాబు వణికిపోతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్నాడని భూమన విమర్శించారు. ప్రభుత్వ తప్పులు సామాజిక మధ్యమాల్లో ప్రసారం కావడం తట్టుకోలేక సోషల్‌ మీడియానే నిషేధించాలని చంద్రబాబు తనయుడు లోకేష్‌బాబు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రకటించారన్నారు. అయితే గూగుల్‌లో పప్పు ఆంధ్రప్రదేశ్‌ అని కొట్టగానే లోకేష్‌ బొమ్మతో సహా వస్తుందని, అలాగని గూగుల్‌ను బ్యాన్‌ చేస్తారా, అంత శక్తి మీకుందా అని చంద్రబాబు, లోకేష్‌బాబులను ప్రశ్నించారు. చంద్రబాబు దురాగతాలపై భూమన హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాలను బ్యాన్‌ చేయాలని విపత్కర, వింత పోకడలకు ఏపీ సర్కార్‌ తెరతీసిందన్నారు. ఆంధ్రరాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా భావిస్తున్న చంద్రబాబు పాకిస్తాన్, ఇరాన్, టర్కీ, కొరియా, ఈజిప్టు, సిరియా లాంటి దేశాల్లో సామాజిక మాధ్యమాలను నిషేధించినట్లుగా ఇక్కడ నిషేధించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. 

వాయిస్‌ ఆఫ్‌ ది పీపుల్‌ సోషల్‌ మీడియా
ఫోర్త్‌ ఎస్టేట్‌ను తనకు అనుకూలంగా మార్చుకున్న చంద్రబాబు ఫిఫ్త్‌ ఎస్టేగా, వాయిస్‌ ఆఫ్‌ ది పీపుల్‌గా పేరుగాంచిన సోషల్‌ మీడియా గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తున్నాడని భూమన దుయ్యబట్టారు. గతంలో ఇదే సామాజిక మాధ్యమాల ద్వారా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ఫై అత్యంత దారుణంగ దాడిచేసి చంద్రబాబు ప్రయోజనం పొందారని గుర్తు చేశారు. ప్రభుత్వ అన్యాయాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్న వారిని బాబు అణగొక్కాలనే కుట్రలు చేస్తున్నారన్నారు. మీ పాలనే శాశ్వతం అనుకొని పొగిడితేనే ప్రజాస్వామ్యం అనుకంటే అంతకంటే దిగజారుడు తనం ఇంకోటి ఉండదని చంద్రబాబును హెచ్చరించారు. ప్రజాస్వామ్య విప్లవాల ద్వారా చంద్రబాబుకు తగిన రీతిలో గుణపాఠం జరుగుతుందన్నారు. 

చంద్రబాబుది రాక్షసానందం
రాష్ట్రంలో కులాల మధ్య కుంపటిపెట్టి చంద్రబాబు రాక్షస ఆనందాన్ని పొందుతున్నాడని భూమన ఆరోపించారు. విద్యార్థి దశ నుంచి చంద్రబాబుది ఇదే వైఖరి అని ఎద్దేవా చేశారు.  బాబు పాలనను వ్యతిరేకించిన వ్యక్తుల మీద టీడీపీ నాయకులతో బండబూతులు తిట్టిస్తూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. అనంత సంస్కారాలకు ఖిల్లాగా మారిన అనంతపురం జిల్లా ప్రతిష్టను జేసీ దివాకర్‌రెడ్డి దిగజార్చుతున్నారని భూమన ఆరోపించారు. వైయస్‌ జగన్‌ఫై జేసీ దివాకర్‌రెడ్డి వ్యక్తిగత కక్ష పెంచుకొని ప్రతీకారం తీర్చుకోవడానికి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జేసీ రాక్షస భాష విని రాయలసీమ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు. వ్యక్తిగత లాభం కోసం, చంద్రబాబు మెప్పుకోసం సూర్యుడి మీద ఉమ్ము వేస్తే ఎవరి మీద పడుతుందో తెలియకుండా జేసీ మర్చిపోతున్నారన్నారు. దివాకర్‌రెడ్డి వైయస్‌ జగన్‌పై వాడుతున్న పదజాలం దుర్మార్గంగా ఉందన్నారు. దీన్ని ఆపాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తండ్రి వైయస్‌ రాజారెడ్డిల ద్వారా జేసీ పొందిన లబ్ది ప్రజలందరికీ తెలుసని చురకంటించారు. 

దాష్టిక పాలనను అంతమొందించేందుకు వైయస్‌ఆర్‌ సీపీ ఉంది
ప్రజాస్వామ్యానికి జరుగుతున్న నష్టాన్ని పూరించడానికి, దాష్టిక పాలనను అంతమొందించడానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉందని భూమన స్పష్టం చేశారు. కులపిచ్చి టీడీపీకి ఉండొచ్చు కానీ వైయస్‌ జగన్‌కు లేదన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక కులానికి, ఒక మతానికి ప్రాతినిధ్యం వహించే పార్టీ కాదని, అవసరాలకు కులం తలను కూడా తెగనరికి చంద్రబాబు కాళ్ల దగ్గరపెట్టే వైఖరి జేసీదని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఉన్న సభ్యత, సంస్కారం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తిచెందేలా జేసీ ప్రవర్తించాలని చురకంటించారు. రాజకీయాల్లో సంస్కారవంతమైన భాషను ప్రయోగిద్దామని, విజ్ఞతతో వ్యవహరిద్దామని హితవుపలికారు. 

తాజా ఫోటోలు

Back to Top