ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా

హైదరాబాద్ః చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా ప్రజల ఆవేదనను పట్టించుకోవడం లేదని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేకహోదా కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటే టీడీపీ దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు. బాబుకు హోదా తీసుకురావాలన్న ఉద్దేశ్యం ఏమాత్రం లేదన్నది ప్రతీ క్షణం తేలిపోతుందన్నారు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురానని బాబు చెప్పడం దుర్మార్గమన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుకున్న బాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఐదు కోట్ల ఆంధ్రుల గొంతు కోస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు.

Back to Top