పంట నష్టపరిహారానికి భీమాకు లింకు పెట్టొద్దు

కుందుర్పి:పంటనష్టపరిహానికి పంటలభీమాకు ముడిపెట్టకుండా వేరుశెనగ పంటసాగు చేసిన రైతులకు వేర్వేరుగా అందజేయాలని వైయస్సార్‌సీపీ మండల కన్వినర్‌ సత్యనారాయణశాస్త్రి, మాజీజడ్‌పీటీసీ ఈరన్న,రైతు సంఘం నాయకులు వన్నూర్‌రెడ్డి,తెనగల్లు లింగప్ప,కరిగానిపల్లి తిప్పేస్వామి,రామూర్తి తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిభంధనల మేరకు జిల్లాకు మంజూరైన భీమా కంపెనీ విడుదల చేసిన రూ,410కోట్లు, ఇన్‌పుట్‌ సబ్సీడీ 1032కోట్లు వేర్వేరుగా రైతులకు అందజేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లో పంటరుణాలు రెన్యూవల్‌ చేస్తున్న తరుణంలో రైతులు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఈనెల15వతేదీలోపల భీమా మరియు ఇన్‌పుట్‌ సబ్సీడీ నిధులను రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమచేయాలని వారు డిమాండ్‌ చేశారు. భీమా నిధుల్లో కిరికిరి పెడితే రైతుల పక్షాన ఆంధోళనలు చేపట్టి న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

Back to Top