ఆరోగ్యశ్రీని.. అనారోగ్యశ్రీగా మార్చొద్దు

* ఏపీలో ఆరోగ్యశ్రీ అమలు అధ్వాన్నం
* ప్రభుత్వ అసమర్ధత వల్ల  మూల‌న ప‌డిన‌ సంజీవని
* బడ్జెట్‌లో అరకొరగా నిధుల కేటాయింపులు
* వైద్యం కోసం పేదలు పొలాలు అమ్ముకోవాల్సిన దుర్భర పరిస్థితులు
* కమీషన్ల కోసం అవసరం లేకపోయినా అదనపు చెల్లింపులు
* బాబు దృష్టి అంతా అవినీతి–మరింత అవినీతి–తిరుగులేని అవినీతి
* ఆరోగ్యశ్రీ బంధువులతో ఈ నెల 9న కలెక్టరేట్ల ఎదుట ధర్నా

హైదరాబాద్‌: పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేశారు. ఈ పథకం ఎంతో మంది పేదల ప్రాణాలు నిలిపి, వారి పాలిట సంజీవనిగా నిలిచింది. ప్రస్తుతం ఈ పథకం లక్ష్యం నీరుగారుతోంది. పేదలు జబ్బు చేస్తే వైద్యం కోసం పొలాలు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటివి అమలు కాక, చదువుల కోసం..వైద్యం కోసం పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్లిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన మనసును కలచివేసింది. బాధితుల వేదన విన్న వైయస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శనివారం బహిరంగ లేఖ రాశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చొద్దని ప్రతిపక్ష నేత కోరారు.. టీడీపీ పాలన గురించి ఆయన మూడు ముక్కల్లో చెప్పారు. అవినీతి–మరింత అవినీతి– తిరుగులేని అవినీతి అని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీ పథకానికి నిధుల కేటాయింపుపై ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపడుతున్నట్లు ప్రకటించారు.


Back to Top