ఈ బడ్జెట్ లోనైనా రైతులకు న్యాయం చేస్తారా..?

అసెంబ్లీః రైతులకు రుణాలు మాఫీ చేయకుండా ప్రభుత్వం బ్యాంకులను నిందిస్తూ తప్పించుకుంటుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రుణాలు మాఫీ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో విశ్వ‌శ్వ‌రరెడ్డి మాట్లాడుతూ... ఈ బ‌డ్జెట్‌లోనైనా రైతుల‌కు న్యాయం చేస్తారా లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇప్పటికీ రూ. 5వేల కోట్లకు పైగా  రైతుల‌కు రుణామాఫీ చేయాల్సి ఉంద‌న్నారు. లక్షా 40 వేల కోట్లు నిధులిచ్చామని కేంద్రం చెబుతుంటే..చంద్రబాబు మాత్రం కేంద్రం నిధులు ఇవ్వలేదని అంటున్నారని, ఇందులో  ఏది నిజమ‌ని ఆయ‌న ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టి వ‌ర‌కు బంగారు రుణాల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేద‌న్నారు. ప్రభుత్వ నిర్వాకం కారణంగా  రుణామాఫీ కాక‌పోవ‌డంతో.... రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 400 మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు. 
Back to Top