వైయస్సార్సీపీలో చేరిన డీఎల్ వర్గీయులు

వైయస్ఆర్ కడప: వైయస్ఆర్ సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి.  వైయస్ఆర్ జిల్లాలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి వర్గీయులు పార్టీలో చేరారు. వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో కాజీపేట జెడ్పీటీసీ లక్ష్మిదేవి, మరో ఆరుగురు ఎంపీటీసీలు పార్టీలోకి వచ్చారు. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు చెప్పారు.

గతంలో వైయస్ఆర్ సీపీని వీడిన ఆరుగురు కడప కార్పొరేటర్లు గురువారం మళ్లీ సొంతగూటికి చేరారు. ఇడుపులపాయలో వైయస్ జగన్ సమక్షంలో వారు పార్టీలో చేరారు.  వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, మేయర్ సురేష్‌ బాబు నేతృత్వంలో వారు మళ్లీ పార్టీలోకి వచ్చారు. వైయస్ఆర్ జిల్లాలో జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

Back to Top