బాబు పాలనలో ఉద్యోగాలు రావు

వైయస్‌ జగన్‌ను కలిసిన దివ్యాంగులు
విశాఖపట్నం: వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఉన్నత చదువులు చదివితే చంద్రబాబు ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయడం లేదని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. 241వ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దివ్యాంగులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు పాలనలో ఎంత చదివినా జాబు వస్తుందనే నమ్మకం లేదన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే మాకు ఉద్యోగాలు వస్తాయని, 2019 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని దివ్యాంగులు అన్నారు. 
Back to Top