దివాకర్‌రెడ్డికి రాజకీయ సమాధి తప్పదు

–వైయస్సార్‌ కుటుంబాన్ని విమర్శించే హక్కు జేసీకి లేదు
–ఏ ఎండకు  ఆ గొడుగు పట్టే సంస్కృతి దివాకర్‌ది
–వైయస్సార్‌ కష్టాన్ని బాబు సొమ్ము చేసుకోవడం విడ్డూరం
–ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి ధ్వజం

రాజంపేటః టీడీపీ ఎంపీ జెసీ దివాకర్‌రెడ్డిపై వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు మండిపడ్డారు. తీరు మార్చుకోకుంటే రాజకీయ సమాధి కాక తప్పదని హెచ్చరించారు. వైయస్సార్‌ జిల్లా రాజంపేటలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...దివాకర్‌రెడ్డి వైయస్ కుటుంబంపై చేసిన కారుకూతలపై మండిపడ్డారు. దివాకర్‌రెడ్డి ఏ ఎండకు ఆ గొడుకు పట్టే సంస్కృతిని ఆకలింపుచేసుకొని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దివంగత మఖ్యమంత్రి  వైయస్‌రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని తెలుగు ప్రజలు ఎన్నటికి మరువలేరన్నారు. అటువంటి వైయస్సార్‌ కుటుంబాన్ని, శాసనసభ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహనరెడ్డిని విమర్శించే హక్కు దివాకర్‌రెడ్డికి లేదన్నారు. గతంలో రాజశేఖరరెడ్డి దగ్గర ముఖ్య అనుచరుడిగా కొనసాగిన సంగతిని ఆయన మరిచారా అని ప్రశ్నించారు. దివాకర్‌రెడ్డి అవలంభిస్తున్న రాజకీయ వైఖరిని, టీడీపీ రాజకీయాన్ని ప్రజలు అసహ్యిం చుకుంటున్నారని పేర్కొన్నారు. వేదికలపై సీఎం ఉద్దేశ్యపూర్వకంగా వైయస్సార్సీపీని, వైయస్ జగన్ ను విమర్శించేందుకు పార్టీలో దివాకర్‌రెడ్డి లాంటి వారిని పక్కన పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. రెండు నాల్కల ధోరణి, విభజించు పాలించు విధానాలతో చంద్రబాబు చేస్తున్న కుట్ర రాజకీయాలపై ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. 

వైయస్సార్‌ కృషి, కష్టాన్ని బాబు తనది చెప్పుకోవడం సిగ్గుచేటు
జలయజ్ఞం పేరుతో ఈ రాష్ట్రంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశ్యంతో అనేక ప్రాజెక్టులకు ప్రాణంపోసిన జలదాత వైయస్సార్‌ అని ఎంపీ మిథున్‌రెడ్డి,  ఆకేపాటి అమర్‌నాధరెడ్డిలు  కొనియాడారు.  వైయస్సార్‌ చేసిన కష్టాన్ని చంద్రబాబు సొమ్ము చేసుకునేందుకు చేస్తున్న వ్యవహారాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. వైయస్ఆర్ రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారని, సంక్షేమం ప్రతి ఒక్కరికి అందించాలనే తపన ఆయనదన్నారు. చంద్రబాబుకు వైయస్సార్‌తో పోల్చుకొనే స్ధాయిలేదని అన్నారు. పులివెందుల ప్రాంతానికి నీళ్లు అందించాలన్న ఉన్నతాశయంతో వైయస్‌ రాజశేఖరరెడ్డి  పైడిపాలెం ప్రాజెక్టు నిర్మాణంకు అంకుర్పారణ చేశారనే విషయం వైయస్సార్‌ జిల్లా ప్రజానీకానికి తెలుసునని పేర్కొన్నారు.  చంద్రబాబు ఎంత చెప్పినా చెవుటోడి ముందు శంఖం ఊదినట్లుగా మారుతుందే తప్ప, ప్రజలు, రైతుల నుంచి ఆదరణ ఏ మాత్రం ఉండదనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రం సస్యశ్యామలమైదంటే అది ఒక్క రాజన్న పాలనలోనే సాధ్యపడిందన్నారు. ఇప్పుడు టీడీపీ పాలనలో ఆ పరిస్ధితి పత్రికల్లో ప్రకటనలు గుప్పించేందుకు మాత్రమే పరిమితమైందని ఎద్దేవా చేశారు. సమావేశంలో వైయస్సార్‌సీపీ రాజంపేట పట్టణ కన్వీనరు పోలా శ్రీనువాసులురెడ్డి, వైయస్సార్‌సీపీ జిల్లా అధికారప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 రైతు సంక్షేమమే దేశాభివృద్ధికి మార్గం
రాష్ట్రస్ధాయి ఎద్దుల పోటీలను ప్రారంభించిన ఆకేపాటి, మిథున్ రెడ్డి

తాళ్లపాక(రాజంపేట)రైతు సంక్షేమమే దేశాభివృద్ధికి మార్గమని  రాజంపేట లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్ధలమైన తాళ్లపాక గ్రామంలో శుక్రవారం క్షత్రియసేవాసంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్ధాయి బండలాగు(ఎద్దుల)పోటీలను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలలనుంచి విచ్చేసిన రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ...రైతులకు మేలు జరిగిదంటే అది ఒక్క దివగంత సీఎం వైయస్‌రాజశేఖరరెడ్డి పాలనలో అనే గుర్తుచేశారు. సంస్కృతి, సంప్రాదాయాలు కలకాలం నిలవాలంటే తరతరాలుగా వస్తున్న గ్రామీణ క్రీడలు, ఎడ్లబండ్ల పోటీలు, బండలాగుడు పోటీలు జరుగుతున్నందవల్లనే అని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ అంటే రైతులదేనని గుర్తుచేశారు. పాడిపంటలు కళకళలాడినప్పుడే సంక్రాంతి పండుగను రైతులు బాగా చేసుకుంటారన్నారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానని, తనకు రైతులు, పశుసంపద అంటే బాగా తెలుసునన్నారు. 

వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధరెడ్డి మాట్లాడుతూ... సంప్రాదాయాలను పరిరక్షించుకోవాలంటే సంక్రాంతి పండుగ లాంటిది ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఆరుగాలం కష్టపడి రైతులు పంటలు సాగుచేసి, వచ్చే దిగుబడి ఇంటికి చేరితే ఆ రైతు కళ్లలో కనిపించే ఆనందం కన్నా మరొకటి ఉండదన్నారు. కార్యక్రమంలో రాజంపేట ఎంపీపీ ఆకేపాటి రంగారెడ్డి, తాళ్లపాక ఎంపీటీసీ నవీన, వైయస్సార్‌సీపీ పట్టణ కన్వీనరు పోలా శ్రీనువాసరెడ్డి, రాజంపేట బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు శరత్‌కుమార్‌రాజు, మార్కెట్‌కమిటి మాజీచైర్మన్‌ పోలి సుబ్బారెడ్డి, మాజీ ఎజీపీ గురుప్రతాప్‌రెడ్డి, పార్టీ కన్వీనరు భాస్కరరాజు, నీనేస్తం అధ్యక్షుడు పెంచలయ్యనాయుడు పాల్గొన్నారు.  

తాళ్లపాకలో మిథున్, ఆకేపాటికి ఘనస్వాగతం..
తాళ్లపాక గ్రామంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డిలకు శేఖరరాజు ఆధ్వర్యంలో క్షత్రియసేవాసంఘం నేతృత్వంలో భారీ ఘనస్వాగతం పలికారు. గజమాలతో తాళ్లపాక గ్రామస్తులు సత్కరించారు. పెద్దఎత్తున బాణసంచాలను కాల్చారు. వీరికి అడగుడుగునా పూలస్వాగతం పలికారు. స్ధానికంగా నేతలు నూకారమణారెడ్డి, శంకరరెడ్డి, ఎన్‌ఆర్‌ఐ శేఖరరాజు, బాలరాజు శేఖర్‌రాజు, రామిరెడ్డి, అంజన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. 



తాజా వీడియోలు

Back to Top