వైయస్సార్సీపీలో చేరిన జిల్లా నేతలు

కరీంనగర్‌: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిని  రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్‌ అన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ కేవలం ప్రకటనలకే పరిమితమైందని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అనే ఒక నినాదం తప్ప, రాష్ట్రాన్ని బంగారు మయం చేయడానికి కేసీఆర్‌ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. కరీంనగర్‌ జిల్లాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి శివకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా శివకుమార్‌ సమక్షంలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైయస్‌ఆర్‌ సువర్ణ పాలనను తిరిగి తీసుకువచ్చేందుకు వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి పోరాటం చేసేందుకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం చేస్తుందన్నారు. పార్టీలోని ప్రతి కార్యకర్త వైయస్‌ఆర్‌ను స్మరించుకుంటూ వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ముందుసాగుతున్నామన్నారు. 14 సంవత్సరాలు పోరాటం చేసి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ చేసిన అభివృద్ధి తప్ప టీఆర్‌ఎస్‌ చేసిందేమీలేదని స్పష్టం చేశారు. 


 
Back to Top