ఎంపీ పుట్టిన రోజు సంధర్భంగా విద్యార్థులకు నోట్‌పుస్తకాల పంపిణీ

గోనెగండ్ల: కర్నూలు పార్లమెంట్‌ సభ్యులు బుట్టారేణుక పుట్టిన రోజును పురస్కరించుకొని మంగళవారం స్థానిక మెయిన్‌ స్కూల్‌లో పాఠశాల కోఆప్సన్‌ మెంబర్, వైయస్‌అర్‌సీపీ యువనాయకుడు పెయింటర్‌ రహిమాన్‌ విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, పలకలు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. ఈంధర్భంగా ఆయన మాట్లాడుతూ.... విద్యార్థులకు తమ వంతుగా ఆదుకొనేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిమ్మప్ప, ఉపాధ్యాయులు గంగాధర్, షాషావలి తదితరులు పాల్గొన్నారు.

Back to Top