అనైతిక చ‌ర్య‌లు మానుకోండి..!


వ‌రంగ‌ల్‌) వరంగ‌ల్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం వ‌ద్ద ఉన్న దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హాన్ని తొలగించ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. ర‌క ర‌కాల కార‌ణాలు చూపించి ఈ విగ్ర‌హాన్ని అక్క‌డ నుంచి తొల‌గించార‌ని వైఎస్ఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ చ‌ర్య‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్‌చేశారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే క‌లెక్ట‌ర్ కు విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు విగ్ర‌హాల విష‌యంలో సుప్రీం కోర్టు మార్గ ద‌ర్శ‌కాలు ఉన్న‌ప్ప‌టికీ, వాటిని పట్టించుకోకుండా ఇటువంటి చ‌ర్య‌ల‌కు పూనుకోవ‌టం స‌రైన‌ది కాద‌ని ఈ విన‌తి పత్రంలో తెలియ‌చేశారు. 
Back to Top