అనంతపురంః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంగన్ వాడీలపై ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిలకు పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు. విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి యత్నించిన వారిని తొలగిస్తామనడం సరికాదన్నారు. అంగన్ వాడీలకు వేతనాలు పెంచుతామని చెప్పి చంద్రబాబు విధులనుంచి తొలగించడం దారుణమన్నారు. గతంలో జీతాలు పెంచమని అడిగినందుకు అంగన్ వాడీలను గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబుదని విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. <br/>కాల్ మనీ సెక్స్ రాకెట్ లో నిందితులుగా ఉన్న టీడీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విశ్వేశ్వర్ రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. అదేవిధంగా రాష్ట్రంలో కరవు ప్రాంతాలను చంద్రబాబు విస్మరించారని విశ్వేశ్వర్ రెడ్డి ఫైరయ్యారు. కేంద్రానికి కరవు నివేదిక పంపే తీరిక కూడా లేదా చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు.