'డిసిసిబి ఎన్నిక వాయిదా అప్రజాస్వామికం'

కడప, 21 ఫిబ్రవరి 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మద్దతుదారు‌ల గెలుపు తథ్యమని తేలిపోవడంతో కుట్ర చేసి కడప డిసిసిబి చైర్మన్‌, వైస్‌ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారని ‌డిసిసిబి చైర్మన్ అభ్యర్థి ఈ.తిరుపా‌ల్‌రెడ్డి ఆరోపించారు. శాంతి భద్రతలను కారణంగా చూపి ఎన్నికను వాయిదా వేయడం అప్రజాస్వామికం అని ఆయన గురవారం ఇక్కడ అన్నారు. డిసిసిబి ఎన్నిక ఎప్పుడు జరిగినా వైయస్‌ఆర్‌సిపి మద్దతుదారులదే విజయమని తిరుపాల్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top