అగ్రిగోల్డ్ బాధితుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌కు ప‌ట్టు

ఏపీ అసెంబ్లీ: అగ్రిగోల్డు బాధితుల స‌మ‌స్య‌లపై అసెంబ్లీలో చ‌ర్చ చేప‌ట్టాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప‌ట్టుప‌ట్టారు. బుధ‌వారం ఉద‌యం అసెంబ్లీ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యం ప్రారంభం కాగానే ప్ర‌తిప‌క్ష స‌భ్యులు అగ్రిగోల్డు బాధితుల స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తారు. ఇంత ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య‌పై స‌భ‌లో చ‌ర్చించాల‌ని స్పీక‌ర్‌ను కోరినా అధికార ప‌క్షం ఎదురుదాడికి దిగ‌డంతో వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యులు స్పీక‌ర్ పోడియం ఎదుట నిర‌స‌న తెల‌ప‌డంతో స‌భ‌ను స్పీక‌ర్ 10 నిమిషాలు వాయిదా వేశారు.

Back to Top