ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై వివక్ష తగదు

– ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు
– 12వ డివిజన్‌లో సిమెంటు రోడ్డు పనులకు భూమిపూజ
కడప కార్పొరేషన్: ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులు మంజూరు చేయకపోవడం దారుణమని ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు విమర్శించారు. 12వ డివిజన్‌ ముత్రాసుపల్లెలో రూ.7.65లక్షల ఎస్‌ఎఫ్‌సీ నిధులలో చేపట్టిన సిమెంటు రోడ్డు పనులకు వారు భూమిపూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ....ఎమ్మెల్యేలకు హక్కుగా రావలసిన నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఓడిపోయిన టీడీపీ నాయకుల పేర్లతో ఇవ్వడం అప్రజాస్వామికమన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడపకు ఒక్క పైసా నిధులు విడుదల చేయలేదని, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, ఎంపీ నిధులతోనే అరకొర అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ముత్రాసుపల్లెలో రహదారికి అడ్డంగా ఉన్న విద్యుత్‌స్తంభాలను తొలగించాలని ఆ శాఖ ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ పి. చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, డీఈఈ తులసీకుమార్, 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ సానపురెడ్డి శివకోటిరెడ్డి, కార్పొరేటర్‌ రామలక్ష్మణ్‌రెడ్డి, సీహెచ్‌ వినోద్‌కుమార్, సాయి మహేష్‌ పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top