మైనారిటీలపై వివక్ష

పట్నంబజారు: రాష్ట్రంలో మైనారిటీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వివక్ష చూపుతున్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్కెట్‌బాబు విమర్శించారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మూడు సంవత్సరాల పాలనలో చంద్రబాబు సర్కార్‌ మైనారిటీలకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మైనారీటీలకు ఎనలేని సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయంలానే పరిగణిస్తున్న చంద్రబాబు సర్కార్‌కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. మైనారిటీ విభాగం నగర నేత షేక్‌ గౌస్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో సైతం మైనారిటీలకు ప్రాధాన్యత కల్పించిన ఘనత వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. ముస్లిం వర్గాలను చిన్నచూపు చూస్తున్న చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు షేక్‌ షఫీ, షేక్‌ ఫాతిమా, షేక్‌ ఆసియా, ఫఠాన్‌ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Back to Top