వైఎస్సార్సీపీ సంతకాల సేకరణ

ఎన్నికల ముందు అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి నెరవేర్చకుండా వాటిని తుంగలో తొక్కారు. ఈనేపథ్యంలో  టీడీపీ ప్రభుత్వం మోసాలను ఎండగడుతూ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మేనిఫెస్టోలో ప్రజల కోసం పెట్టిన అంశాలను చంద్రబాబు నెరవేర్చని దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ ను సంప్రదించేందుకు ఈకార్యక్రమం చేపట్టారు.

 రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు, ప్రముఖ విద్యాసంస్థల్లో సంతకాల కార్యక్రమం కొనసాగింది.విద్యార్థి విభాగనేతలు ఎక్కడిక్కడ సంతకాలు సేకరించారు. వీటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

అధికారదాహం కోసం చంద్రబాబు ప్రజలను మాయమాటలతో నమ్మించి వందలాది వాగ్దానాలు ఇచ్చాడు. పీఠం దక్కేసరికి హామీలకు తూట్లు పొడిచి ప్రజలను మోసం చేశారు.  18 నెలలవుతున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా విచ్చలవిడీగా రాష్ట్రంలో అవినీతికి పాల్పడ్డారు. ప్రజాసమస్యలను గాలికొదిలి సీఎం, మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశారు. అనతికాలంలోనే  వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారు. 
Back to Top