రైల్వే జోన్ కోసం వినూత్న నిరసన

విశాఖపట్నం) విశాఖ ప్రత్యేక
రైల్వే జోన్ కోసం వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్
చేస్తున్న దీక్ష మూడో రోజుకి చేరుకొంది. విభజన చట్టంలో పొందు పరిచిన అంశాన్ని అమలు
చేయాలని ఎంత మొత్తుకొంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదన్నమాట వినిపిస్తోంది.
కేంద్రం మీద ఈ మేరకు ఒత్తిడి తీసుకొని రావాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం
వహిస్తోందని స్థానికులు అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డు
మీదనే స్నానం చేసి గుడివాడ అమర్ నాథ్ నిరసన తెలిపారు. కాగా ఉత్తరాంధ్రలోని అనేక
ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఈ దీక్షకు మద్దతు తెలుపుతున్నాయి. తెలుగుదేశం,
బీజేపీ మినహా ప్రధాన పార్టీలు అయిన వామపక్షాలు, లోక్ సత్తా తదితర పక్షాలు ఇప్పటికే
సంఘీభావం వెలిబుచ్చాయి. 

Back to Top