రాష్ట్రంలో నియంత పాలన

శ్రీ‌కాకుళం(జలుమూరు): రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని వైయస్అర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ తీవ్రంగా విమర్శంచారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి చెందిన ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి పోస్టుమార్టమ్‌ చేయకుండా మృతదేహాలను తరలించారని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డిపై కేసు నమోదు చేయడం అన్యాయమని ఆయ‌న మండిప‌డ్డారు. త‌ప్పుడు కేసుల‌ను నిర‌సిస్తూ గురువారం జ‌లుమూరు తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు నల్లబాడ్జీలతో ఆందోళన చేశారు. ఇందులో పాల్గొన్న కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. అధికార పార్టీకి చెందిన బస్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా ప్రతిపక్ష నేతపై తమ అక్కసు వెళ్లగక్కడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. బస్సు ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు లేదు, బాధితులకు సహాయ సహాకారాలు అందించకుండా కేవలం ప్రతిపక్షనేతపై కేసులు నమోదు చేసి వాస్తవాలును పక్కతోవ పట్టించుకునేందుకు చంద్రబాబు అధికారులును వాడుకుంటున్నారన్నారు. దీనికి ముందు తెలుగు దేశం ప్రభుత్వం రాక్షస పాలనకు చరమగీతం పాడాలని నిర్లక్ష్యంగా వ్యవహారించిన వారిపై చర్యలు తీసేకోవాలని,దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యంను శిక్షించాలని,బాదితులుకు పరిహారం అందించి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ తహశీల్దార్‌ ప్రవళ్లికా ప్రియకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, పార్టీ మండల కన్వీనర్‌ ఎం.శ్యామలరావు, వైస్స్‌ ఎంపీపీ ప్రతినిధి టీ.సతీస్,తంగి మురళీకృష్ణ,పైడి విఠలరావు, కోన దామోదరావు, బుక్కా లక్ష్మణరావు,పంచిరెడ్డి లింగమూర్తి,పి.విజయ్,బగాది జోగినాయడు,వాన నాగేశ్వరరావు,వెలమల అసిరినాయడు,సోమినేని కృష్ణ,దొరబాబు,బోర సింహాచలం,వాన గోపి తోపాటు పలువురు పాల్గొన్నారు.

Back to Top