ఢిల్లీ అత్యాచారంపై విజయమ్మ, షర్మిల మౌనదీక్ష

అనిగండ్లపాడు (కృష్ణాజిల్లా), 20 ఏప్రిల్‌ 2013: దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటనను నిరసిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, మరో ప్రజాప్రస్థానం పాదయాత్రికురాలు శ్రీమతి షర్మిల మౌనదీక్ష చేపట్టారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అనిగండ్లపాడులో వారితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారంనాడు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసనదీక్ష చేశారు.
Back to Top