ప్రత్యేకహోదా కోసం ధర్నా..బొత్స

హైదరాబాద్) ప్రత్యేక హోదా మీద
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేందుకు, ప్రజల తరపున నిలదీసేందుకు ఈ నెల పదో
తేదీన కలెక్టరేట్ ల ఎదుట ధర్నాలు, ఆందోళనలు చేపడుతున్నామని వైఎస్సార్సీపీ సీనియర్
నేత, మాజీమంత్రి బొత్సా సత్యనారాయణ వెల్లడించారు. ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ
చంద్రబాబు చేసిన ప్రకటనలతోనే కేంద్ర ప్రభుత్వం హోదా అవసరం లేదంటూ స్టేట్ మెంట్
ఇవ్వగలిగిందని ఆయన అభిప్రాయ పడ్డారు. మాజీమంత్రి పార్థ సారధితో కలిసి ఆయన మీడియాతో
మాట్లాడారు. ప్రత్యేక హోదా మీద పోరాడేందుకు మాట్లాడేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం
సిద్ధంగా ఉందా అని ఆయన నిలదీశారు. ప్రజల తరపున హోదా మీద వైఎస్సార్సీపీ
ఎప్పటికప్పుడు ఉద్యమబాటలో నడుస్తోందని బొత్సా గుర్తుచేశారు. ఇప్పటికైనా చంద్రబాబు
ప్రభుత్వం తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. 

Back to Top