గ్యాస్‌ ధరలు తగ్గించాలని ధర్నా

విశాఖ‌ : పెంచిన గ్యాస్‌ ధరలకు నిరసనగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శ‌నివారం విశాఖ న‌గ‌రంలో ధర్నా నిర్వహించారు. పార్టీ నాయ‌కులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై సామాన్య ప్రజలను సైతం పీక్కుతింటున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఇప్పటికే అనేకమార్లు గ్యాస్‌ ధరలు పెంచి వినియోగదారుల నడ్డివిరిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ‌తంలో కేంద్రం పెంచిన గ్యాస్ ధ‌ర‌ల‌ను దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి భ‌రించార‌ని, ప్ర‌జ‌ల‌పై ఎలాంటి భారం వేయ‌లేద‌ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే కేంద్రం పెంచిన గ్యాస్ ధ‌ర‌ల‌ను భ‌రించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు.

Back to Top