న్యాయం జరగకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నా

కూలీల మృతి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం
హామీలను గాలికొదిలేసిన బాబు సర్కార్
ప్రభుత్వ తీరుపై జననేత మండిపాటు
మృతుల కుటుంబాలకు పరామర్శ
గుంటూరుః ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో ఇటీవల మృతి చెందిన కూలీల కుటుంబసభ్యులను ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పరామర్శించారు. లక్ష్మీపురంలో భవన నిర్మాణ పనుల్లో పునాది తీస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడడంతో  ఏడుగురు కూలీలు మృతి చెందారు. తీవ్ర విషాదంలో ఉన్న మృతులు సునీల్, ప్రశాంత్, సలోమన్, రాజేష్, శేషుబాబు, సుధాకర్, రాకేష్ కుబుంబ సభ్యులను  వైయస్ జగన్  పరామర్శించి ఓదార్చారు. ఈసందర్భంగా వారు జననేతను పట్టుకొని కన్నీటిపర్యంతమయ్యారు. 

కూలీల మృతికి బిల్డర్ నిర్లక్ష్యమే కారణమని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. కూలీల మృతికి కారణమైన బిల్డర్ను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రమాదం జరిగిన అనంతరం మృతుల కుటుంబాలకు 30 లక్షలు ఎక్స్ గ్రేసియా, ఐదెకరాల భూమి కూడా ఇస్తామని హామీ ఇచ్చారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం పట్ల వైయస్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 

మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నేరుగా 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. 10 రోజుల్లో న్యాయం జరగకుంటే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని వైయస్ జగన్ హెచ్చరించారు.
Back to Top