యాక్షన్‌ ఆపండి బాబూ

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మన ప్రసాదరావు
పాదయాత్ర ఎందుకు చేస్తారో మీకు తెలియదా?
ప్రతిపక్షం సభకు రాకపోవడానికి ఎవరు బాధ్యులు
ఏనాడైనా ప్రతిపక్షాన్ని పిలిచి అభిప్రాయం తెలుసుకున్నారా?
రాజ్యాంగ వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు.
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తున్నారని, అసెంబ్లీ సాక్షిగా మీరు చేస్తున్న యాక్షన్‌ ఆపాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు సూచించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న పాదయాత్రపై, ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విధానంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. అప్రజాస్వామికంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రశ్నిస్తే తమ పార్టీ నుంచి గెలిచి మీ పార్టీలో చేరిన వారితో సమాధానం చెప్పించడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోకుండా ప్రతిపక్షం సభకు రావడం లేదని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు యాక్షన్‌ చేస్తున్నారని ఫైర్‌అయ్యారు. ప్రతిపక్షం సభకు రాలేదని మీరు మదన పడే ముందు ఫిరాయింపు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయండి. మేం ఎల్లుండే శాసన సభకు వస్తామని స్పష్టం చేశారు. మా చాలెంజ్‌ను మీరు స్వీకరించండి ధర్మాన సవాల్‌ విసిరారు.

  ఆత్మ వంచన చేసుకోండి
వైయస్‌ జగన్‌  పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కసారి ఆత్మవంచన చేసుకోవాలని ధర్మాన ప్రసాదరావు సూచించారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రపై ముఖ్యమంత్రి సహా, మంత్రులు, టీడీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్క మాట మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. పాదయాత్ర ఎందుకు చేస్తారో మీకు తెలియాదా? అని ప్రశ్నించారు. రాచరిక వ్యవస్థలోనే చక్రవర్తులు పాదయాత్రలు చేశారు. పిడించే వర్గం తయారైతే.. పిడితులను బుజ్జగించేందుకు, వారికి ధైర్యం చెప్పేందుకు రాజులు కూడా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు పాదయాత్ర చేశాయన్నారు. అద్వానీచ చంద్రశేఖర్‌ చేశారు. మన రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కూడా పాదయాత్ర చేశారని చెప్పారు. మీరు పాదయాత్ర చేసినప్పుడు మీ బృందం ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా? అన్నారు.  వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తే ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. 

అసలు మీ బాధ ఏంటీ?
వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తుంటే వ్యతిరేకిస్తున్నారా? లేక అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని నిందిస్తున్నారా?  అసలు మీ బాధ ఏంటో అర్థం కావడం లేదని ధర్మాన ప్రసాదరావు అన్నారు. గవర్నర్‌ వ్యవస్థను కూడా చంద్రబాబు నాశనం చేస్తున్నారని తప్పుపట్టారు. ఏ నాడైనా ప్రతిపక్షం అభిప్రాయాన్ని తెలుసుకున్నారా అని ప్రశ్నించారు.  వైయస్‌ జగన్‌ పాదయాత్ర ద్వారా ప్రజలకు ఊరట కలిగించడం తప్ప అంటారు. సినిమా టికెట్లు పెంచారు. కరెంటు చార్జీలు, పెట్రోలు ధరలు పెంచి ప్రజలను పిండేస్తున్నారే. వారిని బుజ్జగించడానికి పాదయాత్ర ఓ సాధనం కాదంటారా? 29 రాష్ట్రాలు ఉన్నాయి. 

2వేల రహస్య జీవోలు
ఏ రాష్ట్రంలోనైనా 2 వేల రహస్య జీవోలు విడుదల చేసిన చరిత్ర ఉందా? అని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. గతంలో ఏ ప్రభుత్వమైనా ఇన్ని జీవోలు విడుదల చేశాయా? జర్నలిస్టులకు, ప్రజలకు తెలియకుండా రహస్యంగా విడుదల చేసే జీవోలను ఏమంటారన్నారు. ఈ విషయాలను పాదయాత్రలో ప్రజలకు చెప్పడం తప్పా? రాష్ట్ర అప్పు లక్షల కోట్లు పెంచింది మీరు కాదా బాబు. ఈ విషయం చెప్పడానికి వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ఎవరైనా అప్పు చేస్తే ఆ రాష్ట్రంలోని నిర్మాణాలను పెంచే ప్రయత్నం చేస్తారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరుస్తారు. మీరు ఆ అప్పులను పంచుకుతింటున్నారని ఆరోపించారు. ఈ అప్పులు ఎవరు తీర్చాలి. ప్రశ్నించడం ప్రతిపక్షం బాధ్యత అని గుర్తు చేశారు. మీకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర వింతగా కనిపిస్తే అది మీ ఖర్మ అన్నారు.  జన్మభూమి కమిటీల పేరుతో నిరంతరం భయోత్పాతం కల్పిస్తూ ప్రజలను అడ్డగోలుగా భయపెడుతున్న విషయాలను మీరు ఇంటింటికి కార్యక్రమంలో తెలుసుకున్నారా? అని నిలదీశారు. మీ మ్యానిఫెస్టోలో ఏటా  5 లక్షల ఇల్లు కడతామన్నారు. అంటే నాలుగేళ్లలో 20 లక్షల ఇల్లు కట్టాలి. ఎన్ని ఇల్లు కట్టారు. వ్యవసాయం దివాలా తీస్తే రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆర్థనాదాలు పెడుతున్నారు. మీరు చేసిన మోసాలకు మోసపోయిన వారే వైయస్‌ జగన్‌ పాదయాత్రకు వస్తున్నారు. సినిమా చూసేందుకు రావడం లేదు. తమ ఆవేదన చెప్పేందుకు పాదయాత్రకు వస్తున్నారు. ఆరు మాసాలుగా కూలీ పని చేసిన ఉపాధి కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో లాండ్‌ ఆర్డర్‌ వ్యవస్థ సక్రమంగా లేదు. తమ పరిపాలన దిగజారిపోయిందని గుర్తు చేస్తున్నారని లె లిపారు. ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలను తొలగించిన తరువాత ప్రతిపక్షాన్ని సభకు ఆహ్వానించండి అని హితవు పలికారు. నలబై ఏళ్ల అనుభవం ఉన్న మీకు ఇది తగునా? ప్రతిపక్షం సభకు రాకపోవడం మీకు అవమానంగా లేదా అని ధర్మాన ప్రశ్నించారు.
 
Back to Top