<br/>హైదరాబాద్: ఏపీ ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ప్రజలు తరుపున పోరాటం చేయాల్సిన ప్రభుత్వం..... ప్రజలకు నచ్చచెప్పేందుకు మత్నిస్తుందని మాజీమంత్రి, సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావు విమర్శించారు. ఏడాది కాలంలో ప్రత్యేకహోదాపై మాట్లాడని ప్రభుత్వ పెద్దలు ఓటేసిన ప్రజలను వంచిస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఒకటేనని చంద్రబాబు ఏపీ ప్రజలకు నష్టం చేసే యత్నం చేస్తున్నారన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమని ఈ సందర్భంగా ధర్మాన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ తిరస్కరిస్తే మీరెందుకు నోరు మెదపడం లేదని ధర్మాన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలిగి ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు