వ‌న‌రుల్ని కొల్ల‌గొడుతున్న తెలుగుదేశంశ్రీ‌కాకుళం) రాష్ట్రంలోని స‌హ‌జ వ‌నరుల్ని తెలుగుదేశం పార్టీ కొల్ల‌గొడుతోంద‌ని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియ‌ర్ నేత ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఆరోపించారు. అన్ని ఇసుక రేవుల్నిటీడీపీ నేత‌లు కొల్ల‌గొడుతున్నార‌ని ఆయ‌న అన్నారు. శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయ‌కులంతా ఇసుక‌మాఫియాలా మారిపోయార‌ని ధ‌ర్మాన మండిప‌డ్డారు. అక్ర‌మాల‌కు నిర్ల‌జ్జ‌గా పాల్ప‌డుతున్నార‌ని ధ‌ర్మాన అన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకొనేందుకు ప్ర‌భుత్వ అధికారులు భ‌య‌ప‌డుతున్నార‌ని ధ‌ర్మాన వివ‌రించారు. అక్ర‌మార్కుల‌కు టీడీపీ పెద్ద‌ల అండ ఉండ‌ట‌మే దీనికి కార‌ణ‌మ‌ని ధ‌ర్మాన పేర్కొన్నారు.

Back to Top