సమైక్యాంధ్రకు నిజమైన స్టార్‌ వైయస్ జగ‌న్

శ్రీకాకుళం :

సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో ఉద్యమిస్తున్న ఏకైక నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అని, అందుకే ఆయప నిజమైన సమైక్య స్టార్ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీ వైయస్ జగ‌న్ సమక్షంలో శ్రీకాకుళంలో ఆదివారం జరిగిన సభలో వైయస్ఆర్‌సీపీలో చేరిన సందర్భంగా ధర్మాన మాట్లాడారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి తర్వాత అంతటి నాయకత్వం రాష్ట్రంలో లేకుండా పోయిందని, ప్రస్తుత రాజకీయాల్లో నాయకత్వ లక్షణాలు, తండ్రి ధీరత్వం, రాజసం శ్రీ జగన్‌లో ఉన్నాయన్నారు.

శ్రీ జగన్ నాయకత్వంలో‌ రాజన్న రాజ్యం మళ్లీ  వస్తుందన్న ఆశతో ప్రజలంతా ఎదురుచూస్తున్నారని ధర్మాన అన్నారు. సమైక్య నినాదాన్ని 2010లోనే పార్లమెంట్‌లో విన్పించిన నాయకుడు శ్రీ జగన్ ఒక్కరే‌ అని చెప్పారు. ‘సమైక్య చాంపియన్లు అని ఎవరికి వారు అనుకుంటే సరిపోదు. ప్రజలంతా శ్రీ జగన్‌నే సమైక్య స్టార్‌గా నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలో నూరు శాతం సీట్లను గెలిపించుకుని వైయస్ఆర్‌సీపీని అధికారంలో తేవడమే మా లక్ష్యం’ అని ఆయన తెలిపారు.

తాను పార్టీ మారడంలో ఎలాంటి స్వార్థం లేదని, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారన్న ఆవేదనతోను, శ్రీ జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో వై‌యస్ఆర్‌సీపీలోకి వచ్చానన్నారు. రాష్ట్ర విభజనలో అధికార పార్టీని నిలదీయాల్సిన చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించడంలో విఫలమయ్యారన్నారు.

సోనియాకు రాజీనామా లేఖ :
కాంగ్రెస్ పార్టీకి, శాసన‌ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ధర్మాన ప్రసాదరావు పేర్కొంటూ సోనియాగాంధీకి ఆదివారం ఉదయం ఫ్యాక్సు ద్వారా లేఖ పంపారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆవేదన చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top