శ్రీకాకుళం : జనవరి 3వ తేదీ నుంచి జరగనున్న జన్మభూమి గ్రామసభల్లో తప్పనిసరిగా పాల్గొనాలని వైఎస్సార్సీపీ క్యాడర్కి ఆ పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.... ప్రభుత్వ పక్షపాత వైఖరి, అవినీతి, అక్రమాలను అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.<br/>20 నెలల ప్రభుత్వ పాలనలో ఒక్క పేదవాడికి ఇల్లు మంజూరు చేయడం కానీ పాత బిల్లులు చెల్లించడం కానీ జరగలేదన్నారు. ఇసుక విధానంపై చంద్రబాబు కేబినెట్ తొమ్మిది సార్లు చర్చించి కూడా పరిష్కారం కనుగొనలేదంటే.. అది పూర్తిగా కేబినెట్ వైఫల్యమే అని ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు.