జనవరి 1న ధర్మాన రైతు దీక్ష

శ్రీకాకుళంః వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు జనవరి 1న జిల్లాలో రైతు దీక్ష చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను వైయస్సార్సీపీ నాయకులు జిల్లా పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. రైతాంగానికి భరోసా కల్పించేందుకు ధర్మాన ప్రసాదరావు చేపడుతున్న నిరసన దీక్షను విజయవంతం చేయాలని పార్టీ నేతలు జిల్లా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేశారు. పండుగ తరుముకొస్తోంది. ధాన్యం గింజలు కొనే నాథుడే లేడు. కన్నీరుతో రైతులు. ఏమని చెప్పుకుంటాం నూతన సంవత్సర శుభాకాంక్షలు అని రైతుల కష్టాలను తెలియజేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ధర్మాన రైతు దీక్షకు ప్రతీ ఒక్కరూ సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top