గ‌వ‌ర్న‌ర్ తో ధ‌ర్మాన మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ

శ్రీకాకుళం) తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా పాత మిత్రులు ఆత్మీయంగా కలిశారు.  మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆర్‌అండ్‌బీ వసతి గృహంలో గౌరవపూర్వకంగా కలిశారు. గవర్నర్ జిల్లాకు రావడంపై ధర్మాన సంతోషం వ్యక్తం చేశారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్సార్ ప‌రిపాల‌న‌లో ఇద్ద‌రూ మంత్రులుగా క‌లిసి ప‌నిచేశారు. త‌ర్వాత  రోశయ్య ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్మాన ఆయన మం త్రి వర్గంలో పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరూ క్షేమ సమాచారాలు తెలియజేసుకున్నారు.
Back to Top