<br/>హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేయనున్న మహా ధర్నా కోసం రాష్ట్రం నుంచి రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ నెల ఏడో తేదీన ఈ రెండు రైళ్లు అనకాపల్లి, తిరుపతి నుంచి బయలు దేరతాయని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆయా జిల్లా ల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులు ఢిల్లీ కి తరలి వెళ్లనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రావటం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవటమే ఈ ధర్నా ఉద్దేశమని ఆయన వివరించారు.