అధికార వికేంద్రీకరణ అవసరం..వైఎస్సాసీపీ


ప్రభుత్వ సంస్థలన్నీ అమరావతి లో
పోగు పడటం మీద వైఎస్సార్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.హైదరాబాద్ లో జరిగిన వ్యవహారాన్ని పార్టీ గుర్తు చేస్తోంది.  ఇలా  చేస్తే వేర్పాటువాదానికి దారి తీస్తుందని టీడీపీ
ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
సూచించారు.  ఈ నేపథ్యంలో ముందు చూపుతో వ్యవహరించాలని ఆయన టీడీపీ ప్రభుత్వానికి
హితవు పలికారు. ఆదివారం హైదరాబాద్‑లో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ధర్మాన
ప్రసాదరావు విలేకర్లతో మాట్లాడారు. 

అభివృద్ధి అంతా ఓ ప్రాంతంలోనే కేంద్రీకృతం చేస్తే... మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. విభజనతో పాఠాలు నేర్చుకోలేదా ? అని చంద్రబాబును ఈ సందర్భంగా ధర్మాన సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్రంలో
అభివృద్ధిని వికేంద్రీకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంతా రాజధాని
ప్రాంతంలో కేంద్రీకృతమయితే మళ్లీ సమస్యలుపునరావృతమయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన
చెందారు. 

 

Back to Top