<strong>హైదరాబాద్, 21 మార్చి 2013:</strong> 'ధర'కాసుర ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలంటూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీలో ఫ్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు రాష్ట్రంలో బతకలేని పరిస్థితి నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై తక్షణమే చర్చించాలని అసెంబ్లీలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చినట్లు పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు. శాసనసభను వాయిదా వేస్తూ పారిపోతోందని పార్టీ ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీ ఆవరణలో విమర్శించారు.