సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన మంత్రి

విజయవాడః కృష్ణా కరకట్ట అక్రమ నిర్మాణాలపై ప్రశ్నలు సంధించిన మీడియాకు సమాధానం చెప్పలేక మంత్రి దేవినేని ఉమ ప్రెస్ మీట్ నుంచి పారిపోయారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా అని మీడియా ప్రశ్నించగా నీళ్లు నమిలారు. కోర్టు పరిధిలో ఉందంటూ సమాధానం దాటవేశారు. గతంలో మీరే అవి అక్రమ నిర్మాణాలని నోటీసులు ఇచ్చారుగా అని విలేకరులు ప్రశ్నించారు. దీంతో, జవాబివ్వకుండా ప్రెస్ మీట్ ముగించి దేవినేని వెళ్లిపోయారు. చంద్రబాబు నివాసం సహా 57 అక్రమ కట్టడాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Back to Top