ఉన్మాదిలా మారిన దేవినేని

హైదరాబాద్ః బాధ్యత గల మంత్రిగా కాకుండా దేవినేని ఉమ ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ, దాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే బురదజల్లే కార్యక్రమం చేస్తుందని ఫైర్ అయ్యారు. పోలవరం బద్ధ వ్యతిరేకి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని పార్థసారథి దుయ్యబట్టారు. 
Back to Top