వైయస్సార్‌ కుటుంబంతోనే రాష్ట్రాభివృద్ధి

కుందుర్పి:వైయస్సార్‌ కుటుంబంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తద్వారా ప్రతి కుటుంభం వైయస్సార్‌ కుటుంబంలో చేరి అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను పొందాలని ఆపార్టీ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్‌ సూచించారు. బుధవారం మండలంలోని కరిగానిపల్లిలో మండల కన్వినర్‌ సత్యనారాయణశాస్త్రి,జిల్లా కార్యదర్శి ఎస్‌కే ఆంజినేయులతో కలసి వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో 5ఇళ్లకు వెళ్లి ఆయా కుటుంభ సభ్యులను వైయస్సార్‌ కుటుంబంలో చేర్పించారు.బూత్‌ కమిటీ కన్వనర్లు సభ్యులు నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి అధికార పార్టీ మోసాలు చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలపై వివరించి వారిని వైయస్సార్‌ కుటుంబ సభ్యులుగా చేర్పించేందుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్‌పీటీసీ ఈరన్న,రాజగోపాల్,మాజీ సర్పంచులు రాధాస్వామి,తిప్పేస్వామి,లింగప్ప,రాజు,అతావుల్లా కరిగానిపల్లి వైయస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top